title credits -
నువ్వు ఎలాగైనా సక్సెస్ అవ్వాలి --అప్పుడే ప్రతిభ కి గుర్తింపు ..
అప్పటి వరకు ప్రతిభ వున్నా లేనట్టే మరి --ఇది నిజం ..
ఎన్నో రోజులు కష్టపడి..చాలా సినిమాలు స్టార్ట్ అవుతాయని ఆశ పడి..ప్రతీ డైరెక్టర్ చుట్టూ తిరిగి అలసి పోయాను ...ఒక అవకాశం వచ్చింది కదా అని చించుకుని రాసాను ..
ఆ సినిమా పేరు ..క్రేజీ హార్ట్స్ ..పోస్టర్ లోను , పేపర్ లోను నా పేరు పడింది ...
అది చూసి తెగ మురిసి పోయాను ..కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలబడలేదు ..ఆ సినిమా ఆగిపోయింది ...
తర్వాత చాలా ఏళ్ళు తర్వాత ..అమ్మమ్మగారిల్లు సినిమా కి టైటిల్ కార్డు పడింది ..ఇది చూసుకుని కూడా మురిసిపోయాను ..కానీ ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేకపోవడం తో నాకు ఇంకా కసి పెరిగింది ..అయితే ఈ సినిమా నాకు చాలా అనుభవాలు నేర్పింది ..
సినిమా సక్సెస్ - చాలా వాటి మీద ఆధారపడి ఉంటుంది అని - అందులో ముఖ్యం గా కాస్టింగ్ అని తెలుసుకున్నాను ...
మార్షల్ సినిమా కి టైటిల్ కార్డు పడింది ..
తర్వాత "దర్జా " సినిమా కి సాక్షాత్తు శివయ్య దగ్గర టైటిల్ కార్డు పడింది ..దీనికి కారణం కో డైరెక్టర్ రాజా గారు ..ఆయనకు థాంక్స్ ..
దరిదాపు 30 సినిమా స్క్రిప్ట్ లు రాసి వుంటాను ..అవన్నీ వెలుగు చూడలేదు ..వాటిలో కొన్ని అయినా సినిమా లు గా మారి ఉంటే బాగుండేది అనిపిస్తుంది ..అన్నీ మన చేతిలో లేవు అని తర్వాత తెలుస్తుంది ..
స్క్రిప్ట్ అనలిస్ట్ గా నేను రాసినవి .. "మనం " - సినిమా స్క్రిప్ట్ ఎనాలిసిస్ -నాగార్జున గారు చదివారని తెలిసి ఆనందం వేసింది ..సుకుమార్ గారు , మేర్లపాక గాంధీ గారు -ఇలా ఎందరో చదివారని చాలా హ్యాపీ ..
యూట్యూబ్ ద్వారా చాలా మంది - చాలా నేర్చుకున్నాం అంటుంటే చాలా హ్యాపీ గా ఉంటుంది ...ఆ శివయ్య , అమ్మవారి ఆజ్ఞ ..అలా చేయాలని వాళ్ళు సంకల్పించుకున్నారు ..ఈ జర్నీ లో నేను చాలా నేర్చుకున్నాను ..అందరికీ థాంక్స్ ..
Comments
Post a Comment