2nd - Phase Trails In Film Industry ( 2004 - 2005 )

" నీ ప్రతిభ ఇండస్ట్రీ కి కావాలి..నువ్వు అవసరం లేదు " 

-----------------------------------------------------------------------------------

ఫిలిం ఇండస్ట్రీ లోకి రావడానికి టాలెంట్ వుండాలని అర్ధం అయ్యింది ...

సెకండ్ ఫేజ్ ట్రైల్స్ స్టార్ట్ చేశా... 

జ్ఞాపకం 1 : 

నేను తార్నాక లో ఫ్రెండ్స్ తో ఉండేవాడిని ...మొత్తం 15  మంది ...అందరూ సాఫ్ట్ వేర్ నేర్చుకుంటున్నారు ..నేను మాత్రం ఇండస్ట్రీ లో తిరిగే వాడిని ..

అప్పుడు నాకు మొదట ఝలక్ ఇచ్చింది -కమెడియన్ జెన్నీ గారు ...

తార్నాక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కలిసాను ఆయన్ని ...

అయన ఒకటే చెప్పారు ..

" నేను నిన్ను రామానాయుడు గారి దగ్గరకి తీసుకెళ్తా ..స్టోరీ రాస్తావా ? డైలాగ్స్ రాస్తావా ? " వెంటనే రాయాలి ..అక్కడ ఆలోచిస్తా.. అంటే కుదరదు ..నామాట విని ...ఏమి చదువుకున్నావ్ ? చదివిన చదువు కి 5 వేలో ,పది వేలో సంపాదించు ..అప్పుడు ఇండస్ట్రీ ట్రైల్స్ వేయి ..." అన్నారు ..బాగా ఆలోచనల్లో పడ్డాను ...

జాబ్ లో జాయిన్ అయ్యాను ...

అదే "శ్రీ కృష్ణ ఫార్మాస్యూటికల్ "- ఉప్పల్  లో ...

-----------------------------------------------------------------------------------

జ్ఞాపకం 2 :

జాబ్ చేస్తున్న నాకు ఫిలిం ఇండస్ట్రీ మీదా ఇంకా పీకుతూనే వుంది ..

అయినా ట్రైల్స్ వేస్తూ రకరకాల వ్యక్తులను కలిసే వాడిని ..

చాలా మంది తో పరిచయాలు అయ్యేవి ..

వాళ్ళెవరూ సినిమా తీయరు ..సినిమా కి దగ్గరగా లేరు అని అనిపించేది ..

చాలా మంది తో పరిచయాలు ఆగిపోయాయి ..

వాటివలన నాకు ఉపయోగం లేక పోయింది ..

ఇక్కడ మా కాకినాడ మూడో  అన్నయ్య కుమార్- ఎస్ ఆర్ నగర్ లో ఒకర్ని పరిచయం చేసాడు ..

ఆ అబ్బాయి -ఫిలిం ఇండస్ట్రీ లో వున్నాడు ..

అతను నాకు పెద్ద క్లాస్ పీకాడు ..

" హమ్ దిల్ దే చుకే సనమ్- సినిమా లో ఒక సీన్ చెప్పి ..ఇలా రాయగలరా ? ఇలా యాక్టింగ్ చేయించి చెప్పగలరా ? ఇవన్నీ చేయాలి డైరెక్షన్ అంటే ...ఇది చాలా కష్టం అని చెప్పాడు ..

ఆరోజు ఇంకా డిసైడ్ అయ్యా ..

సినిమా సంగతి ఏమిటో ,..నేర్చుకోవాల్సింది ఎంత ఉందొ .. అంతా నేర్చుకోవాలని ..

-----------------------------------------------------------------------------

జ్ఞాపకం 3 : 

వన్ ఇయర్ అయ్యింది ..జాబ్ లో రాజకీయాలు ఎక్కువయ్యాయి ..

నాకు చిరాకు అనిపించింది .. 

ఆ టైమ్ లో రామోజీ ఫిలిం సిటీ కి లెటర్ రాసాను ..రెప్లై వచ్చింది ..

నీదగ్గర వున్న కధలు చెప్పు అని ...

దానితో ఒక్కసారిగా ఆనందం...ఉద్వేగం ...

నేను మూడు కధలు రెడీ చేశాను .."ఆశలు", " సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ ", " బంధు మిత్రుల అభినందనలతో " --- ఇవన్నీ రఫ్ గా రాసుకుని స్టార్ట్ అయ్యా..

రామోజీ ఫిలిం సిటీ కి వెళ్ళాను ...

కధలు చెప్పాను....కధల్లో కాన్ఫ్లిక్ట్ ఉండాలి ..అని మొదట సారి విన్నా..

ఇంకా బాగా డీటెయిల్ గా రాసుకోవాలి మీరు --అని పంపించారు ..

అప్పుడు అర్ధం అయ్యింది ..

ఈ ప్రతిభ సరిపోవడం లేదు ..ఎదో మన దగ్గర ఉండాలి ..అది ఏమిటి ? 

సెర్చింగ్ మొదలైయ్యింది ..

-----------------------------------------------------------------------------------

జ్ఞాపకం 4 : 

జాబ్ మానేసాను ..

మళ్ళీ దిల్ సుఖ్ నగర్ లో నా ఊరి ఫ్రెండ్ , శ్రీరామ్ అంకుల్ గారి అబ్బాయి దామోదర్ రూమ్ కి వచ్చాను ..వాడు శుక్రవారం " ఆంధ్ర భూమి - వెన్నెల " పేపర్ కొనేవాడు ..

అది నేను చదవడం స్టార్ట్ చేశా ..రివ్యూ లు చదువుతుంటే సినిమా మీద అవగాహన వచ్చేది ..

అందులో కొన్ని ఆర్టికల్స్ బాగా ఆకర్షించేవి ..

అందులో సికిందర్ గారి ఆర్టికల్స్ బాగా నాలెడ్జ్ గా ఉండేవి ... 

మొదటి గురువు గా నేను భావిస్తాను ..

అయన ఆర్టికల్స్ లో నేను " సైడ్ ఫీల్డ్ స్క్రీన్ ప్లే బుక్ " గురించి విన్నాను ...


మీరు  సికిందర్ గారి  రివ్యూ లు చదవ వచ్చు అంటే ఈ కింద బ్లాగ్ ఓపెన్ చెయ్యండి ..

https://sikander-cinemascriptreview.blogspot.com/

-----------------------------------------------------------------------------------

జ్ఞాపకం 5 : 

ఇక్కడ రకరకాల జాబ్స్ చేసే వాడ్ని ..ఫైనల్ గా లెక్చరర్ అయ్యాను ..ఇదే బెటర్ అనిపించింది ..కెమిస్ట్రీ ,ఫిజిక్స్  హోమ్ ట్యూషన్స్ చెప్పడం ..సినిమా ట్రైల్స్ వేయడం ..

అలా ఒక బ్యాచ్ పరిచయం అయ్యారు ..

వాళ్లే --కరణ్ భరణి , శ్రీకాంత్ , సూర్య ప్రకాష్ జోస్యుల గారు , నరేష్ , 

అనుదీప్ (జాతి రత్నాలు ఫేమ్)  ..

ఇలా అందరూ అమీర్ పేట్ లో ఇప్పుడున్న ఆర్ .ఎస్ . బ్రదర్స్ పైన పెంట్ హౌస్ లో డిస్కషన్ లు చేసే వాళ్ళం ..ఒక్కోసారి ఉస్మానియా యూనివర్సిటీ కి వెళ్లే వాళ్ళం ...

ఇలా చాలా రోజులు గడిచాయి ..

కరణ్ బాగా నరేట్ చేసే వాడు ..

కరణ్ ఒక మంచి షార్ట్ ఫిలిం తీసాడు ..మలుపు అని ..చాలా బాగుంటుంది ..

నాకు ఆర్ జి వి లా అనిపించిన వ్యక్తి ...టాలెంటెడ్ పర్సన్ ...






సూర్య ప్రకాష్ జోశ్యుల గారు ..

మంచి రచయిత , విశ్లేషకులు 

 అయన ఆర్టికల్స్ నుండి చాలా నేర్చుకున్నాను ..

అయన రాసిన బుక్స్ చదువుకుని  , చాలా విషయాలు తెలుసుకున్నాను ..

--------------------------------------------------------------------------------

జ్ఞాపకం 6 : 

నేను శ్రీకాంత్ కలసి ఒక స్క్రిప్ట్ చేసాము ..

అది శ్రీకాంత్ - hero సుమంత్ కి నరేట్ చేయడానికి వెళ్ళాడు ..

ఇప్పుడు చేస్తున్న సినిమా ఇలాగె వుంది అని సుమంత్ అనడం తో అది ఆగిపోయింది ..తర్వాత శ్రీకాంత్ లైట్ తీసుకున్నాడు ..

-------------------------------------------------------------------------------

జ్ఞాపకం 7  : 

ఒక శూన్యం ఆవరించింది ..

సినిమా అంటే ఏమిటి ? 

నేను తెలుసుకున్నానా ?

ఎదో వుంది ..ఎదో ఇంకా నేర్చుకోవాలి ? ఎలా ? 

ఎవరు చెబుతారు ?  ఈ ప్రశ్నలు నన్ను వేధించాయి ...చాలా బాధ పడ్డాను ...

ఒకరోజు అమ్మ వారు .." సొంతం గా నీకు నువ్వే తెలుసుకోవాలి " అన్నట్టు అనిపించింది ..అప్పటి నుండి నా అన్వేషణ మొదలయ్యింది ...నేటికీ సాగుతూను వుంది ...

ఇదే స్క్రిప్ట్ ఎనాలిసిస్ కి మార్గం వేసింది ...

----------------------------------------------------------------------------

Comments

Popular posts from this blog

2024 - this year works

3rd Phase - film Industry Trails ( 2005 - 2015)