3rd Phase - film Industry Trails ( 2005 - 2015)

 







 "ఒంటరిగా ఆలోచించు .  . శ్రమించు .. అదే నీకు పెట్టుబడి ..

నీకు  ఎవరూ  కళ ని  నేర్పరు.. "

-----------------------------------------------------------------------------------------------------

కనిపెట్టడానికి రెండు మార్గాలు వున్నాయి .

ఒకటి .. ధ్యానం ..ఇతరుల సహాయం లేకుండా మీరు లోతుల్ని అన్వేషించడం ..

రెండు ..ప్రేమ ..ఇతరుల సహకారం తో లోతుల్ని అన్వేషించడం ...

------------------------------------------------------------------------------------------------------------------

జ్ఞాపకం -1 : 

పెంట్ హౌస్ లో ఒక టు ఇయర్స్ ...

వరసగా సినిమాలు చూడడటం ..దాని గురించి ఎనాలిసిస్ చేయడం ..

సిడ్ ఫీల్డ్ బుక్ చూసి ..వాటిని అప్లై చేయడం స్టార్ట్ చేశా...

అలా బుక్స్ లో రాస్తూ వెళ్ళా ..

బుక్ నిండిపోయింది ..

అది అంతా ..బ్లాగ్ లో పెట్టొచ్చు అని పూర్ణా అని ఒక ఆఫీస్ యానిమేటర్ అండ్ ఫ్రెండ్ చెప్పాడు ..

బ్లాగ్ రాస్తూ వెళ్ళా ..50  సినిమాలు ఎనాలిసిస్ చేశా...



https://onlyscriptanalysis.blogspot.com/

---------------------------------------------------------------------------

జ్ఞాపకం -2 : 
సినిమా బ్లాగ్ రాసాను ...
అది చాలా మంది చూసారు ..కొత్త పరిచయాలు అయ్యాయి ...
" క్రేజీ హార్ట్స్ " -- అనే సినిమా కి పని చేసే అవకాశం వచ్చింది ...
దానికి స్క్రిప్ట్ వర్క్ చేసాను ..
https://idlebrain.com/news/functions1/muhurat-crazyhearts-record.html
పోలూరి ఘటికాచలం గారి తో వర్క్ చేసాను ...
ఈ సినిమా ద్వారా చాలా మంది పరిచయం అయ్యారు ..
మొదటి సరిగా నా పేరు పేపర్ లో రైటర్ గా పడింది ..
సంతోషం బుక్ లో పేరు పడింది ..
అది నాన్న చూసి ..వీడు దారికి వస్తున్నాడు అని అనుకున్నారు ..
 అందులో ఒక అసోసియేట్ డైరెక్టర్ - శ్రీరామ్ ఒకడు ..
ఇప్పటికీ అలాగే ఫ్రెండ్ గా కొనసాగుతూ వున్నాడు ...
చాలా కధలు డిస్కస్ చేస్తున్నాం ..డెబ్యూ ట్రైల్స్ లో వున్నాడు శ్రీరామ్ ..
------------------------------------------------------------------------------
జ్ఞాపకం -3: 
తర్వాత నేను రక రకాల జాబ్స్ మారాను ...
లెక్చరర్ గా .... ఈ- లెర్నింగ్ అనిమేషన్ లోను ...
..పూజ టీవీ లో .... 
రేడియో బిందాస్ అనే రేడియో లోను ....
సారధి స్టూడియో లోను ...ఇలా చాలా జాబ్స్ చేసుకుంటూ వెళ్ళాను ...
ఒక రోజు " సినిమా రిపోర్టర్ " పత్రిక గురించి శివ - అని ఒక అసోసియేట్ డైరెక్టర్ చెప్పాడు ..
వాళ్ళకి నా బ్లాగ్ మెయిల్ పెట్టా..
నన్ను రమ్మని పిలిచారు ..
ఒక లేటెస్ట్ మూవీ ఎనాలిసిస్ రాయమన్నారు ..
నేను " వన్ - నేనొక్కడినే "  సుకుమార్ గారు  - మహేష్ బాబు సినిమా ఎనాలిసిస్ రాసాను ..
అది ప్రింట్ అయ్యింది ..
తర్వాత 
అత్తారింటికి దారేది ..మిర్చి ...వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ ..
లెజెండ్ ...ఉయ్యాలా జంపాల ..స్వామి రారా ...మనం 
 
ఇలా 50  కి పైగా ఎనాలిసిస్ లు ప్రింట్ అయ్యాయి ..
చాలా మంది ప్రశంసలు ..చాలా మంది పరిచయాలు ...జరిగాయి ..
జ్ఞాపకం -4 : 
సుకుమార్ గారు పిలిచి చాలా సేపు మాట్లాడారు .." నాన్నకు ప్రేమతో " షూటింగ్ హడావిడి లో వున్నారు .."నా మైండ్ లో వున్నది అంతా ఎలా రాసావు ..ఇది నా బ్లాగ్ లో పెట్టుకున్నా నేను ..ఇప్పటికి 80  వేల మంది చూసారు ..నీ ఎనాలిసిస్ చూసి , చాలా మంది సినిమా కి వెళ్లారు ..అర్ధం చేసుకున్నారు ..నీకు థాంక్స్ .." అంటూ మాట్లాడుతూనే వున్నారు ...
సెల్ఫీ దిగాం ..అదొక అచీవ్ మెంట్... నా లైఫ్ లో మరిచిపోలేనిది ..
next 
జ్ఞాపకం -5 : 
మేర్లపాక గాంధీ గారు నుండి ఫోన్ ...ఒకసారి కలుద్దాం అని ..
వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ స్క్రిప్ట్ ఎనాలిసిస్ -గురించి ఎవరో ఫ్రెండ్ చెప్పారట ...ట్రైన్ ట్రాక్ వేసి ,మరీ ఎనాలిసిస్ చేసాడు అని ...
గాంధీ గారిని వెళ్లి ఫిలిం నగర్ లో కలిసాను ..ఒక స్క్రిప్ట్ వర్క్ చేద్దాం అన్నారు ..
త్రి మంత్స్ స్క్రిప్ట్ వర్క్ చేసాం ...
శర్వా నంద్ - యూ వి క్రియేషన్ సినిమా అది ...
అది షూట్ స్టార్ట్ కాలేదు ...
జ్ఞాపకం -6  : 
మనం స్క్రిప్ట్ ఎనాలిసిస్ నాగార్జున గారు చదివారని  , మెచ్చు కున్నారని తెల్సింది ..
చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ..
జ్ఞాపకం -7  : 
ఇక్కడ "దృశ్యం " సినిమా స్క్రిప్ట్ ఎనాలిసిస్ టైం లో 
లామకాన్ లో ఒక ఫిలిం ఇండస్ట్రీ వర్క్ షాప్ కి వెళ్ళాను ..
అక్కడ ఒక సీన్ రాయమని కాంటెస్ట్ పెట్టారు ..
నాకు ప్రైజ్ వచ్చింది ..
అది నాగబాల సీరియల్ సురేష్ గారి చేతుల  మీదుగా తీసుకోవడం ఒక అచీవ్ మెంట్ ..
----------------------------------------------------------------------------------
జ్ఞాపకం -8 : 




స్క్రిప్ట్ ఎనాలిసిస్ లు చూసిన రైటర్ గోపి మోహన్ గారు..
  ఒక రోజు సారధి స్టూడియో సెట్ లో ఉంటే కలిసాను ...
నన్ను బాగా ఎంకరేజ్ చేసారు సర్.
ఫిలిం ఇండస్ట్రీ లో నన్ను  అందరికీ పరిచయం చేసేవారు ..
కొన్ని సినిమా లకు రికమండ్ చేసారు ..
సర్ తో కలసి -  సుధీర్ వర్మ - శాకినీ డాకిని కి వర్క్ చేశాను ..
నెక్స్ట్ ..ధూమ్ ధామ్ కి వర్క్ చేశాను ...

----------------------------------------------------------------------------------
ఈ స్క్రిప్ట్ ఎనాలిసిస్ ల వలన పరిచయం అయ్యింది... 
సుందర్ ..

అమ్మమ్మగారిల్లు సినిమా ఫొటోస్ -జ్ఞాపకాలు 



 First Screen Credits .....
 Director - జయరాజ్ ..


వీరిద్దరితో జర్నీ జరిగింది 
అమ్మమ్మగారిల్లు ..
మార్షల్ ..సినిమాలు వచ్చాయి ..
--------------------------------------------------------------------------
అసోసియేట్ డైరెక్టర్ అండ్ రైటర్ : సుమన్ 
సినిమా రిపోర్టర్ ఆర్టికల్స్ చదివి కాల్ చేసి , నా సినిమా ఛాన్స్ వస్తే మీరు పని చేయాలి అన్న గారు అంటూ పలకరించాడు ..అలాగే మాట నిలబెట్టుకుని , తనకి ఛాన్స్ రాగానే నన్ను తన టీం లోకి తీసుకున్నారు ..నన్ను పెద్ద రైటర్ లా చూసాడు ..
అలాగే ట్రీట్ చేసాడు ..నన్ను గోవా తీసుకెళ్లారు ..


నేను మరచిపోలేని స్క్రిప్ట్ జర్నీ అది ..
వెర్షన్ లో పది నుండి పదిహేను సీన్స్ రాసేవాడు ..బాగున్నాయా  ? లేదా ? అనేవాడు ..బాగోలేదు అంటే చించేసేవాడు ..అతని తపన చూసి షాక్ తినే వాడ్ని ..నిజమైన ప్యాషన్ ఒక సినిమా వాడిలో ఉండటం నేను సుమన్ లో చూసాను ..నాకు తానొక ఇన్స్పిరేషన్ ..
"మనకు ఒక్కటే సినిమా ..రెండో సినిమా గురుంచి వద్దు ..ఏమి చేసినా మొదటి సినిమా నే " అనే సుమన్ మాటలు నా చెవుల్లో రింగు మంటాయి ...
నరేషన్ బాగా ఇస్తాడు ..నొవెల్స్ బాగా చదువుతాడు ..తానొక ఋషి ...టాలీవుడ్ కి మరొక వర్సటైల్ డైరెక్టర్ అవుతాడు ...సుమన్ 




ఒక పక్క సినిమా పరిచయాలు అవుతున్నా ..నేను యూట్యూబ్ లో స్క్రీన్ ప్లే లెసన్స్ పెట్టడం స్టార్ట్ చేశాను ..అది నేను తీసుకున్న మంచి నిర్ణయం ...
" నేను ఫిలిం ఇండస్ట్రీ లో పడిన బాధలు వేరొకరు పడకూడదు ..ఒక దారి ఏర్పరచాలి ..
సినిమా అంటే ఒక కొత్త కుర్రాడికి అర్ధం అవ్వాలి ..
అలా మొదలైన నా ఆలోచన ..Kinosappi  -అనే యూట్యూబ్ ఛానల్ గా మారింది ...

Comments

Popular posts from this blog

2024 - this year works

2nd - Phase Trails In Film Industry ( 2004 - 2005 )