Very special people to me

 ఫిలిం ఇండస్ట్రీ లో చాల రకాల వ్యక్తులను కలుస్తాము ..టైం స్పెండ్ చేస్తాము ..

ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటాము ..అలా చాలా టాలెంట్ వున్న వ్యక్తులను కలిసాను ..వాళ్ళు ప్రస్తుతానికి సక్సెస్ అయ్యి ఉండక పోవచ్చు ..కానీ వాళ్ళు నాకు ఎప్పటికీ ప్రత్యేక వ్యక్తులే ..లైఫ్ జర్నీ లో ఎప్పటికీ గుర్తుండే వాళ్లే...

--------------------------------------------------------------------------


దేవ్ వర్మ గారు 

అమెరికా నుండి వచ్చారు దేవ్ వర్మ గారు ..చాలా విజన్ వున్న వ్యక్తి ..

భీమవరం సొంత వూరు ..

ప్రభాస్ గారి స్టామినా చూసి -ఒకప్పుడే ఇంటర్నేషనల్ లెవెల్ లో కథ ఆలోచించారు ..

ఆ స్క్రిప్ట్ కి నేను పని చేశాను ..

ఆ స్క్రిప్ట్ " ఒక్క అడుగు "...


ఫిలిం మేకింగ్ గురించి , టెక్నాలజీ గురించి బాగా ఆలోచించే వ్యక్తి ..

నేను చాలా విషయాలు నేర్చుకున్నాను ..నన్ను బాగా ఆదరించారు ...

--------------------------------------------------------------------------

ప్రవీణ్ వర్మ గారు 

నాకు -ధూమ్ ధామ్ సినిమా అప్పుడు పరిచయం అయ్యారు ..

కామన్ ఫ్రెండ్ రమణ గారు మా ఇద్దరి మధ్య వున్నారు ..

ప్రవీణ్ గారు - డైలాగ్స్ బాగా రాస్తారు ..చాలా సినిమాలకి రాసారు ..

మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా - దశరధ్ గారు గురించి - వర్మ గారు ఎంత బాగా చెబుతారో , ఆయన మాటల్లో గ్రాటిట్యూడ్ బాగుంటుంది ..ఇది అయన దగ్గర నేర్చుకున్నాను ..

 

రీసెంట్ గా " మిస్టర్ బచ్చన్ " కి రాసారు .. 

-------------------------------------------------------------------------

వర ప్రసాద్ 

నా ఏన్కూర్ గురుకుల పాఠశాల ఫ్రెండ్ ..

కవితలు బాగా రాస్తాడు ..పాటలు బాగా రాస్తాడు ..

ఏ టాపిక్ మీద అయినా రాయగలడు ..

వీడికి టాలెంట్ అపూర్వం ..అలా ఎలా రాస్తాడు అని పిస్తుంది నాకు ..

తాను సక్సెస్ అవ్వాలి ...

-----------------------------------------------------------------------

ఎడిటర్ జానకి రామ్ గారు 

" అమ్మమ్మగారిల్లు " కి పరిచయం అయిన వ్యక్తి ..

ఎన్నో సినిమాలకి ఎడిటర్ గా పని చేసారు ..

చాలా ఏళ్ల నుండి ఫిలిం ఇండస్ట్రీ లో వున్నారు ..

మంచి -చెడ్డ చెబుతారు ..

చాలా టాలెంట్ వున్న వ్యక్తి ..

ఏదో ఒకరోజు ఇండస్ట్రీ లో టాప్ ఎడిటర్ అవుతారు ...

----------------------------------------------------------------------------

శేఖర్ మోడల్ 

సినిమా నే శ్వాస గా , సినిమా నే ప్రాణం గా వున్న వ్యక్తి ..

డైరెక్టర్ దేవాకట్టా గారి  దగ్గర పని చేసాడు ..

అన్నపూర్ణ ఫిలిం స్కూల్ లో పని చేసాడు ..

సొంతం గా కొన్నాళ్ళు  ఫిలిం స్కూల్ నడిపాడు ..

సొంతం గా సినిమా తీసే పని లో వున్నాడు ..

ఫ్యాషన్ వున్న వ్యక్తి ..

తాను సక్సెస్ అవ్వాలి ..

----------------------------------------------------------------------------

 

సుమన్ అండ్ వాసు గారు 

సినిమా మీద విపరీత మైన ఫ్యాషన్ , భక్తి  ఇద్దరిలో చూసాను ..

వీళ్లిద్దరి తో ట్రావెల్ చేసినప్పుడు నాకు చాలా కొత్త విషయాలు తెలిసాయి..

ముఖ్యం గా  డైరెక్టర్ లు ఎలా ఆలోచిస్తారు అనే విషయం తెలుసుకున్నాను ..

సుమన్ - స్క్రిప్ట్ అండ్ మేకింగ్ విషయం లో చాలా డీప్ గా ఉంటాడు ..

వాసు గారు - స్క్రిప్ట్ విషయం లో డీటెయిల్ గా ఆలోచిస్తారు ..ప్రతీ విషయాన్నీ పట్టించుకుంటారు ..

వీళ్ళిద్దరూ ఫ్యూచర్ లో పెద్ద డైరెక్టర్స్ అవుతారని నా నమ్మకం ..

వాళ్ళ స్క్రిప్ట్ లు కూడా అలాగే ఉంటాయి ...

వీరి తో జర్నీ నా లైఫ్ ని మార్చి  వేసింది ..

-----------------------------------------------------------------------------------


Comments

Popular posts from this blog

2024 - this year works

3rd Phase - film Industry Trails ( 2005 - 2015)

2nd - Phase Trails In Film Industry ( 2004 - 2005 )