So many Great movies
చిన్నప్పుడు నాన్న రాజమండ్రి ఖరీదు కి వెళ్లి , వచ్చి ..
"జగదేక వీరుడు - అతిలోక సుందరి "
ఆ తర్వాత " రోజా " సినిమా టెన్త్ క్లాస్ లో ఉండగా వేణు అంకుల్ ఇంట్లో చూసాము ..
అది చూసాక అంతా ఒక మంచు భావన లో వున్నాను .. గ్రేట్ సినిమా అంటే అర్ధం అయ్యేది కాదు ..చాలా ఏళ్ల తర్వాత మణిరత్నం గొప్పతనం అర్ధం అయ్యింది ...
ఇంటర్మీడియట్ లో ఒకసారి పాల్వంచ దగ్గర ఉన్న అమ్మవారి గుడి కి మొక్కు కోసం అందరం వెళ్ళాం ..బుజ్జి బాబయ్య , నేను, ముత్యాలు అంకుల్ , సత్తిబాబు అంకుల్, నాగ అంకుల్ అందరం - కొత్తగూడెం లో " భారతీయుడు " సినిమా కి వెళ్ళాం ..ఈ సినిమా చూసాక నాకు సినిమా అంటే ఇంత పెద్దగా ,గొప్పగా తీయవచ్చా ? ఆలోచింప చేసేలా తీయవచ్చా ? అని ఆలోచన మొదలయింది .. ఇంటర్ ఖమ్మం లో చేసే నేను - వరసగా ఐదు సార్లు చూసాను ..ఇక్కడే సినిమా డైరెక్టర్ అవ్వాలి అనే ఆలోచన వచ్చి ఉంటుంది ...
Comments
Post a Comment