1st Phase Film Industry Trails ( 2002 - 2004)
సినిమా ఇండస్ట్రీ లో అడుగు పెట్టడం చాలా కష్టం ...
సినిమా ఇండస్ట్రీ లో సక్సెస్ అవ్వడం చాలా కష్టం ..
సినిమా ఇండస్ట్రీ లో కొనసాగడం చాలా కష్టం ...
----------------------------------------------------------------------
జ్ఞాపకం 1:
తెల్సిన వాళ్ళ ద్వారా ఫస్ట్ టైం B.Tech అవ్వగానే రామానాయుడు స్టూడియోస్ లోకి వెళ్ళాను ..
అసిస్టంట్ డైరెక్టర్ గా చేరాలని వెళ్ళాను ..
అక్కడ " అమ్మ నాన్న తమిళ అమ్మాయి "షూటింగ్ జరుగుతోంది .
ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మన్ లిద్దరూ ప్రాక్టీసు చేస్తున్నారు ..
డైరెక్టర్ పూరి జగన్నాధ్ కోసం ఎదురు చూసా ...రాలేదు ..
అనుకోకుండా ఒకరోజు చూసా ...చాలా హ్యాపీ ..
చాలా రోజులు బాక్సింగ్ సెట్ కి వెళ్ళా ...చూస్తున్నా ..ఏమీ అర్ధం కావడం లేదు ..
"ఒక్కటే అర్ధమైంది సినిమా తీయడం అంత ఈజీ కాదు " అని ..
-----------------------------------------------------------------
జ్ఞాపకం 2 :
జ్ఞాపకం 2 :
డైరెక్టర్ కృష్ణ వంశి అంటే క్రేజ్ ..
తన దగ్గర అసిస్టంట్ గా చేరాలని 3 రోజులు ఇండస్ట్రీ రోడ్స్ అన్నీ అన్నం తినకుండా తిరిగి , ఒక రోజు ఆఫీస్ పట్టుకున్నాను ...
ఆ టైం లో ఖడ్గం తీస్తున్నారు ..
" సర్ ..మీదగ్గర అసిస్టంట్ గా చేరతాను అన్నాను .."నేను ...
ప్రస్తుతానికి ఖాళీలు లేవు ..నెక్స్ట్ సినిమా కి చూద్దాం అన్నారు ..
తర్వాత ఎవరినీ అడగలేదు ...
"ఆరో ప్రాణం " డైరెక్టర్ వీరు కే దగ్గరకి మా బాబాయి గారి ద్వారా వెళ్ళాను ..అక్కడ చంద్రబోసు గారిని ఫస్ట్ టైం చూసాను ..అసిస్టంట్ డైరెక్టర్ గా పెట్టుకో అని బాబాయి గారు అడిగితే , సినిమా స్టార్ట్ అయ్యాక చూద్దాం అన్నారు ...
-----------------------------------------------------------------
జ్ఞాపకం 4 :
బాబాయి గారి ద్వారా " అవునా " సినిమా షూటింగ్ ఓపెనింగ్ కి వెళ్ళాను ...
ఫస్ట్ టైం దాసరి నారాయణ రావు గారిని చూసాను ...ఓపెనింగ్ కి దాసరి గారు గెస్ట్ ..
----------------------------------------------------------
----------------------------------------------------------
జ్ఞాపకం 5 :
దాసరి గారిని కలవడానికి అల్యూమినియం ఫ్యాక్టరీ కి వెళ్ళాను
అక్కడ "ఫూల్స్ " సినిమా షూటింగ్ జరుగుతోంది ..
దాసరి గారిని చూస్తూ ఉండిపోయాను ...కలవడం కుదరలేదు ..
-------------------------------------------------------------------
జ్ఞాపకం 6 :
విజయ దశమి సినిమా టైం ..డబ్బింగ్ జరుగుతూ వుంది ..
అప్పుడు నేను సాయికుమార్ గారి కి ఫోన్ చేసి కలిసాను ..
బాగా రిసీవ్ చేసుకున్నారు ..ఫార్ములా - అనే ఒక కథ చెప్పను
..అలాంటి కథ చేశాను ..చెక్ దే ఇండియా లాంటి కథ రాయగలవా ? కోచ్ పాత్ర చేయాలని వుంది ..అన్నారు ..
నేను "ఒలెంపిక్స్" మీద కథ రాసాను ..
ఇదే నేను రాసిన మొదటి కథ అండ్ నరేషన్ ఇవ్వడం ...
చాలా రీసెర్చ్ చేసాను ...కానీ వర్క్ అవుట్ అవ్వలేదు ..
------------------------------------------------------------------
జ్ఞాపకం 7 :
శ్రీహరి గారు ..నేను ఫోన్ చేసి కథ చెప్పాలి అంటూ
విసిగిస్తే ...
" బ్రదర్ ...ఇండస్ట్రీ లో ఎవరూ నీకు అవకాశం ఇవ్వకపోయినా ..నేను ఇస్తా ..ఇంటికి వచ్చి కలవు "
అని అన్న మాటలు ..ఇప్పటికీ చెవుల్లో రింగ్ మంటుంటాయి...
"యాదగిరి ఎం .ఎల్ .ఏ...--- అనే కథ రాసుకుని శ్రీహరి గారి ఇంటికి వెళ్ళా ..
ఇదీ వర్క్ అవుట్ అవ్వలేదు ...
-----------------------------------------------------------------
బాలయ్యబాబు కి కథ :
అప్పట్లో బాలయ్యబాబు కి కథ ఉంటే తీసుకురా అని సత్యనారాయణ చౌదరి గారు అన్నారు ..విపరీతమైన ధైర్యం వచ్చింది ..తార్నాక వెళ్లి కేకే కి చెప్పా ..అంతే అందరం నాలుగు దిక్కులు కూర్చుని స్టోరీ ఆలోచించాము.. నా ఫ్రెండ్ వర్మ అయ్యప్ప స్వామి కి పూజ చేస్తుంటే ఐడియా వచ్చింది ... అయ్యప్ప స్వామి కథ సోషలైజ్ చేస్తే ?? ..
చిన్న కథ గా అనుకుని ,రాసి వెళ్లి కలిశా ...వర్క్ అవుట్ అవ్వలేదు ...
Comments
Post a Comment