Script Analyst & Script Doctor ( 2020 to present )
కళాకారుడు మొదట ఒక రంగం లో జెండా ఎగరవేయాలి ..
-- ముళ్ళపూడి రమణ గారు
-----------------------------------------------------
Script Analyst & Script Doctor
ఫిలిం ఇండస్ట్రీ లో డైలీ చాలా కధలు వినడం ...
వాటి లో ఇంకా కావాల్సిన ఇన్పుట్స్ నుండి స్టార్ట్ చేసి ,
ఫైనల్ షూటింగ్ స్క్రిప్ట్ వరకు ఉండాల్సిన ఎలిమెంట్స్ ,
స్క్రిప్ట్ చెక్స్ అన్నీ చేయడం తో స్క్రిప్ట్ అనలిస్ట్ అండ్ స్క్రిప్ట్ డాక్టర్ గా పేరు వచ్చింది ...
ఈ జర్నీ స్టార్ట్ అయ్యింది ..
అనంత్ సేన రెడ్డి - ( డైరెక్టర్ తేజ దగ్గర పని చేసాడు )..
తాను డెబ్యూ అవుతున్నాడు ..సూపర్ స్టోరీ ..
తాను రాసుకున్న స్క్రిప్ట్ కి స్క్రిప్ట్ కన్సల్టెంట్ గా వర్క్ చేశాను ..
తర్వాత
వాసుదేవ గారి స్క్రిప్ట్ లు ఎనాలిసిస్ చేసి ఇచ్చాను ..
తాను కూడా డెబ్యూ అవుతున్నారు ..
ఆయన స్క్రిప్ట్ లు బౌండ్ చేసుకుని రెడీ గా వుంటారు ..ఆ విషయం ఇన్స్పిరేషన్ గా ఉంటుంది ..
రీసెంట్ గా కో డైరెక్టర్ రమణ గారి ద్వారా పెద్ద సంస్థ లో ఒక స్క్రిప్ట్ ఎనాలిసిస్ చేసి ఇచ్చాను ...
------------------------------------------------------------
జీవితం లో మరిచిపోలేనిది ..నేను చాలా ఇష్టపడ్డ సినిమా " ఆలా మొదలయ్యింది " ..ఆ సినిమా ప్రొడ్యూసర్ , రంజిత్ మూవీస్ అధినేత , తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షులు ,
శ్రీ దామోదర ప్రసాద్ గారు ..
సర్ తో కలసినప్పుడు తీసుకున్న ఫోటో ..
నా స్క్రిప్ట్ ఎనాలిసిస్ ని మెచ్చు కున్నారు ...అది జీవితం లో మరిచిపోలేనిది ..
ఇప్పటికీ సర్ ని కలుస్తూ ,రిలీజ్ అయిన సినిమాల మీద ఎనాలిసిస్ లు వింటూ ,చర్చిస్తూ ఉంటాము ..
-----------------------------------------------------------------------------------
కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ గారి తో
-----------------------------------------------------------------------------------
తనికెళ్ళ భరణి గారి తో :సారధి స్టూడియోస్ లో "నరుడా-దొనరుడా " షూటింగ్ టైం లో తనికెళ్ళ భరణి గారు కనిపిస్తే ,ఫోటో దిగాను ..సర్ " శ్రీకనక మహాలక్ష్మి డాన్స్ ట్రూప్ , యమలీల ఇలా ఎన్నో సినిమాల్లో అయన వేసిన క్యారెక్టర్ లను ఇష్టపడ్డాను ..ఆయన "ఆటగదరా శివ " చెబుతున్నప్పుడు ,నేను పూజ టీవీ లో శంకర్ మట్ లో విన్నాను ..అప్పుడు కుదరలేదు ... చాలా ఇష్టమైన విషయం ..
----------------------------------------------------------------------------------
డైరెక్టర్ గారు , "గుడుంబా శంకర్ " తీసిన డైరెక్టర్ వీర శంకర్ గారి తో ను ఫోటో దిగాను ..
-----------------------------------------------------------------------------------
బొమ్మరిల్లు భాస్కర్ గారు
నేను గీత ఆర్ట్స్ లో ఒక స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నప్పుడు ..బొమ్మరిల్లు భాస్కర్ గారు ని కలిసాను ..అప్పుడు దిగిన ఒక ఫోటో ..ఆ సినిమా నాకొక ఇన్స్పిరేషన్ ..అది నా లైఫ్ లో ఒక మరచి పోలేనిది ...
-----------------------------------------------------------------------------------
అనంత పురం లో ఉద్దండం చంద్రశేఖర్ అని ఒక కవి మిత్రుడు వున్నారు ..
తను ప్రతీ రంగం లో స్ఫూర్తి నింపిన వాళ్ళని లిస్ట్ చేసి , పుట్టపర్తి లో ఒక సన్మానం ఏర్పాటు చేసాడు ..సినిమా స్క్రిప్ట్ విభాగం లో నాకు ఆ గౌరవం ఇచ్చారు ..
అప్పటి ఫోటో ..
Comments
Post a Comment