Kinosappi- Youtube channel - Achievements (2016- 2024)
కినో - అంటే సినిమా --
జర్మన్ వర్డ్
సప్పి - అంటే నాలెడ్జి - ఇటాలియన్ వర్డ్
ఈ రెండు కలిపి పెట్టాను ..యూట్యూబ్ ఛానల్ పేరు ..
దీనికి ఫస్ట్ 5 వీడియోస్ స్టార్ట్ చేయడానికి కారణం . ..వైఫ్ శిరీష , ఎడిటర్ నాగరాజు గారు , ప్రకాష్ , శివ , శ్రీహరి ..ఆ తర్వాత చిన్న కెమెరా ఇచ్చాడు అజిత్ ..దానితో చాలా వీడియోస్ తీసాను ..వీళ్ళు లేకపోతే ఈ ఛానల్ లేదు ..
ముందుగా వీళ్ళకి థాంక్స్ ..
కినోసప్పి ఛానల్ చూసి నేను ఎంతో నేర్చుకున్నాను సర్ - అంటూ ఎంతో మంది వచ్చి కలిశారు ..నాకు శిష్యులు అయ్యారు ...
వాళ్ళందరి తో ఫోటో దిగాలని ఉంటుంది ..
కొంత మందితో దిగాను ..
" నేను కొంత మంది కైనా ఉపయోగ పడ్డాను అని తెలిసి ఆనందం ,సంతృప్తి వస్తుంది ...
కినోసప్పి ఛానల్ --నాకు చాలా మంది ని పరిచయం చేసింది ...
ఇందులో బీమవరం బాబీ ఒకరు ..బాబీ గారు రిఫర్ చేయడం వలన "దర్జా " సినిమా కి వర్క్ చేశాను ..
ఈ సినిమా కెమెరా మాన్ సత్తి బాబు గారు - పటేల్ సర్ సినిమా డైరెక్టర్ -వాసు గారు పరిచయం అయ్యారు ...
--------------------------------------------------------------------------
పటేల్ సర్ సినిమా డైరెక్టర్ -వాసు గారు
వాసు గారి తో నేను త్రీ స్క్రిప్ట్ వర్క్ చేశాను ...
ఒకటి హై బడ్జెట్ మూవీ స్క్రిప్ట్ ...నాగ చైతన్య వరకు వెళ్ళింది ..
రెండవది - జగపతి బాబుగారి తో ఒక టు టైర్ హీరో తో చేయదగిన స్క్రిప్ట్ ..
మూడవది -- జగపతి బాబుగారి కీ రోల్ లో చేసిన ఫీల్ గుడ్ మూవీ స్క్రిప్ట్ ..
నేను ,స్వరూప్ అనుకుంటూ ఉంటాము ..వాసు గారు మాకు ముందే ఎందుకు పరిచయం కాలేదు అని ..ఫిలిం ఇండస్ట్రీ లో మేము చూసిన.. అంత మంచి వ్యక్తి వాసు గారు ..
మాట తూలరు..పద్ధతి గా వుంటారు ..కష్టపడతారు ..ఓపెన్ గా వుంటారు ..పదే పదే ఆలోచిస్తారు ..నాకళ్ళ ముందు ఎన్ని యాడ్స్ తీయడం చూశానో ..అయన సెట్ లో ఎక్స్పీరియన్స్ చూస్తే షాక్ గా ఉంటుంది ..ఆర్టిస్ట్ లను బాగా హ్యాండిల్ చేస్తారు ...
He is great personality ...
--------------------------------------------------------------
Student : Nihanth and Subbu
ఒక స్టూడెంట్ - నేను చేసిన వీడియోస్ లిస్ట్ అంతా నోట్స్ రాసుకుని పి.డి ఎఫ్ చేసి పంపాడు ..ఆ స్టూడెంట్ పేరు - నిహాన్త్...
అండ్ సుబ్బు ...అమలాపురం నుండి నన్ను కలవడానికి వచ్చారు ..కలిశారు ..
------------------------------------------------------------------------------
student భరత్ :
భరత్..రోజు నాకు విషెష్ చెబుతాడు ..వీడియోస్ అన్నీ చూసి నోట్స్ రాసుకున్నాడు ..
ఈ మధ్యన వచ్చి కలిసాడు .."సుందరకాండ " బుక్ ఇచ్చాడు ...ఆ హనుమంతుడిని ఇచ్చాడు ..ఏమి నాభాగ్యం అనిపించింది ఆరోజు ...భరత్ నా గైడెన్స్ లో
సలహాలు వింటూ , ఫిలిం డైరెక్టర్ అయ్యే దారిలో వున్నాడు ...
--------------------------------------------------------------------
Student మున్నా
స్టూడెంట్ ..మున్నా ..నా వీడియోస్ ద్వారా చాలా నేర్చుకున్నాను అని ఘంటాపదం గా చెబుతాడు ..రీసెంట్ గా ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో నా గురించి వాదించి, ఒక స్టోరీ నరేట్ చేసేలా చేసాడు ..వాళ్లకు నచ్చింది ..అది మున్నా ..
మంచి నాలెడ్జి వుంది ..మంచి డైరెక్టర్ అవుతాడు ...
---------------------------------------------------------------------------Associate Director రాజు :
నా స్క్రిప్ట్ ఎనాలిసిస్ లు ,వీడియోస్ చూసి ..నాతో కలసి ఒక క్రైమ్ థ్రిల్లర్ స్క్రిప్ట్ చేసి , నన్ను ,నా ఆలోచనలను స్వీకరించే వ్యక్తి రాజు ...from శ్రీకాకుళం ( వీరఘట్టం )..
గొప్పగా కథ నరేట్ చేస్తాడు ...మంచి సీన్స్ చెబుతాడు ..టాలెంటెడ్ వ్యక్తి ...
----------------------------------------------------------------
student : మణికంఠ
ఒక స్టూడెంట్ ప్రతీ వీడియో చూసి ..మళ్ళీ సెకండ్ రౌండ్ వీడియోస్ అన్నీ చూస్తున్నా- అని నేను చేసిన వీడియోస్ లో వున్నా సినిమా ల లిస్ట్ మొత్తం తీసి చెప్పాడు ..ఆ స్టూడెంట్ పేరు మణికంఠ ...
-------------------------------------------------------------
అసోసియేట్ డైరెక్టర్ అలీ గారు :
మీ వీడియోస్ చూసి చాలా నేర్చుకున్నా సర్ -- అని ఎప్పుడూ చెప్పే వ్యక్తి అలీ గారు ..మై ఫ్రెండ్ ..అసోసియేట్ డైరెక్టర్ అలీ గారి తో నాలుగు స్క్రిప్ట్స్ వరకు చేసాను ...
--------------------------------------------------------------
కో డైరెక్టర్ రమణ గారు :
మీ వీడియోస్ నేను వింటూనే వుంటాను - అని ఓపెన్ గా చెప్పే వ్యక్తి -కో డైరెక్టర్ రమణ గారు ..హీరో సత్య దేవ్ గారి దగ్గరకు తీసుకెళ్లారు ..
ఒక స్క్రిప్ట్ డాక్టర్ గా అక్కడ జర్నీ జరిగింది ..
క్రాంతి బాల అని ఒక డైరెక్టర్ ,సత్యదేవ్ గారి తో జర్నీ చేసాడు ..ఆ స్క్రిప్ట్ పేరు "గరుడ"...
ఇప్పటికీ సత్యదేవ్ గారు "ఎలా వున్నారు రమేష్ గారు అని ప్రేమగా పలకరిస్తారు " ..దీనికి కారణం ...నా శ్రేయోభిలాషి , ఫ్రెండ్ , రమణ గారు ....
ఎంతో అనుభవం , ప్రతీ సినిమా మీద ఎనాలిసిస్ బాగా చేస్తారు ..
ఈయన డైరెక్టర్ అయితే టాలీవుడ్ కి మంచి డైరెక్టర్ వచ్చినట్టే అని నా అభిప్రాయం ..
నాగచైతన్య డెబ్యూ మూవీ " జోష్ " సినిమా ఆడిషన్స్ కి నేను లెటర్ రాసాను ..
ఆ లెటర్ చదివి , నాకు కాంటాక్ట్ అయ్యారు రమణ గారు ..అప్పటి నుండి జర్నీ జరుగుతుంది ...
ఇప్పటికీ అలాగే వున్నారు ..అదే స్నేహం ..నన్ను చాలా మందికి రికమండ్ చేస్తారు ..
-------------------------------------Student : సంజు రెడ్డి
ఫిలిం ఇండస్ట్రీ లో ఒక స్టూడెంట్ స్క్రిప్ట్ రిజిస్ట్రేషన్ చేసి , మీరు పెద్దమ్మ తల్లి గుడి లో
పూజ కి రావాలి సర్ -- పిలిచిన స్టూడెంట్ --సంజు రెడ్డి ..
యువతరం ...ఒంటరిగా శ్రమించే గుణం ఉన్న వాడు సంజు ..
అతనికి అల్ ది బెస్ట్ ..
మంచి డైరెక్టర్ అవ్వాలి ..
--------------------------------------------------------------------------
విశాఖ థ్రిల్లెర్స్ డాన్స్ మాస్టర్ వెంకట్:
వైజాగ్ డైరెక్టర్ గారు నా వీడియోస్ అన్నీ త్రీ డేస్ లో చూసి , నన్ను మెచ్చుకున్నారు ..అయన పేరు విశాఖ థ్రిల్లెర్స్ డాన్స్ మాస్టర్ వెంకట్ గారు ..ఇప్పటికీ ఫోన్ లో డిస్కషన్ చేస్తూనే ఉంటాము ...గొప్ప మనిషి ..మానవత్వం మూర్తీభవించిన మనిషి ..ఆపద లో సహాయం చేసే గుణం అయన సొంతం ...
-------------------------------------------------------------------
దామోదర్ రెడ్డి గారు :
నా వీడియోస్ చూసి ..నన్ను కలసి ....నాతో స్క్రిప్ట్ చేయించుకున్న వారు ..
దామోదర్ రెడ్డి గారు ...రియల్ ఎస్టేట్ లో వున్నారు ..
సర్ స్క్రిప్ట్ వర్క్ నేను , ఫ్రెండ్ శివ చేసాము ..సర్ త్వరలో సినిమా తీయడానికి రెడీ అవుతున్నారు ...అల్ ది బెస్ట్ టు హిమ్..
నేటికీ దామోదర్ రెడ్డి గారు నా వీడియోస్ గురించి , డౌట్స్ గురించి డిస్కస్ చేస్తారు ..
----------------------------------------------------------------------------
జాతి రత్నాలు అసోసియేట్ డైరెక్టర్ విశ్వనాధ్ గారు :
నా వీడియోస్ ద్వారా పరిచయం అయిన వ్యక్తి - జాతి రత్నాలు అసోసియేట్ డైరెక్టర్ విశ్వనాధ్ గారు ..ఆయన రాసుకున్న స్క్రిప్ట్ కి నన్ను కన్సల్టెంట్ గా ఉండమని అడిగి , నా సలహాలు సూచనలు పాటిస్తూ ,స్క్రిప్ట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకు వెళ్లారు .. ఆయన కూడా త్వరలో ఈ స్క్రిప్ట్ తో డెబ్యూ అవ్వబోతున్నారు ...అల్ ది బెస్ట్ టు హిమ్..
---------------------------------------------------------------------
అమలాపురం దుర్గా రావు :
సినిమా రిపోర్టర్ నుండి నన్ను అభినందించే అమలాపురం దుర్గా రావు ..
నాకోసం పూతరేకులు ,స్వీట్స్ తెచ్చాడు ..ఎంతో అభిమానిస్తాడు..
పెనుగొండ భాషా :
---------------------------------------------------------------------------
సినిమా రిపోర్టర్ నుండి నన్ను అభినందించే ఫ్రెండ్ భాషా ..పెనుగొండ
అనంతపురం వెళ్ళినప్పుడల్లా కలిసేవాడిని ..ఇప్పటికీ ప్రతీ విషయం డిస్కస్ చేస్తాడు ..
passion ఉన్న వ్యక్తి ..
---------------------------------------------------------------------------
ముజీర్ గారు ..కెమెరా మాన్..చోట కే నాయుడు గారి అసిస్టెంట్ ...
కొబ్బరిమట్ట సినిమా నుండి మొదలు పెట్టి చాలా సినిమాలకు కెమెరా మాన్ గా పని చేసారు ..ఆయన ఇష్టపడ్డ ఒక కథ- రాజు ( శ్రీకాకుళం - వీరఘట్టం ) ఇచ్చాడు ..
దానికి మూడు నెలలు కూర్చుని ఇద్దరం మంచి స్క్రిప్ట్ చేసాం ..ఇది జీ స్టూడియోస్ లో నరేషన్ చేసాం ..అది వర్క్ అవుట్ చేసే పని లో ముజీర్ గారు వున్నారు ...
-----------------------------------------------------------------------
ఒక రోజు జబర్దస్త్ ఫేమ్ -హుస్సేన్ నుండి ఫోన్ కాల్ ..
సర్ నేను ఒక స్టోరీ రాసాను ..మీరు ఎనాలిసిస్ చేసి చెప్పండి ..మీ ఛానల్ ని నేను ఫాలో అవుతాను ..అన్నాడు ..మణికొండ వెళ్లి , హుస్సేన్ చెప్పిన స్టోరీ విన్నాను ..బాగుంది ..
రైటర్ శ్రీధర్ గారు ..అమలాపురం ఎస్సై గారు ..
సినిమా కథ రాయడానికి ..నా వీడియోస్ అన్నీ చూసారు ..
తెలుసుకున్నారు ..నేర్చుకున్నారు ...
కధలు కొన్ని రిజిస్టర్ చేసుకున్నారు ..
నన్ను కలసి , నా స్క్రిప్ట్ డిస్కషన్ లకు వస్తున్నారు ...
మంచి వ్యక్తి ..అల్ ది బెస్ట్ సర్ ..
అసోసియేట్ డైరెక్టర్ శ్రీకాంత్
" ఎంత ఆప్యాయం గా చెబుతారు మీరు ..
ఎంత బాగా సినిమా కథ చేసుకోవాలో చెబుతారు ..
మీరు మంచి గురువు అన్న .." అంటాడు ..
మంచి కష్టపడే తత్వం వున్నవాడు ...
ట్రైల్స్ లో వున్నాడు ..అల్ ది బెస్ట్ టు హిమ్
-------------------------------------------------------------------------------
డైరెక్టర్ సత్య చక్ర గారు ...
"కిట్టు" అనే నేషనల్ అవార్డు సినిమా తీశారు ..
నాకు మంచి ఫ్రెండ్ ..నేను తాను కలసి స్క్రిప్ట్స్ చేసాము ..అందులో ఒక స్క్రిప్ట్
ఓ టి టి మూవీ గా షూట్ అయ్యింది ..అది పోస్ట్ ప్రొడక్షన్ లో వుంది ...
అల్ ది బెస్ట్ సత్య గారు ..
--------------------------------------------------------------------------------వైజాగ్ రాజు గారు ..
సినిమా రిపోర్టర్ నుండి మొదలు పెట్టి కినో సప్పి వీడియోస్ అన్నీ చూసి ,
నాకు డైలీ విష్ చెబుతూ వుంటారు ..ప్యాషన్ ఉన్న వ్యక్తి ..
ఆయన ఒకసారి సారధి స్టూడియో కి వచ్చి నప్పుడు దిగిన ఫోటో ...
Comments
Post a Comment