Posts

Showing posts from September, 2024

Still Running ...Running

Image
1. అసిస్టెంట్ డైరెక్టర్ గా ట్రైల్స్ వేసాను ..కుదరలేదు ..వెనక్కి వచ్చాను .. 2. సొంత బ్లాగ్ ద్వారా సినిమా ల ఎనాలిసిస్ రాసాను ... 3. తర్వాత - సినిమా రిపోర్టర్ లో - స్క్రిప్ట్ ఎనాలిసిస్ రాసాను ... 4. నెక్స్ట్ ..యూట్యూబ్ వీడియోస్ - కినోసప్పి ఛానల్ ద్వారా 160 వరకూ  చేశాను ..చేస్తున్నాను.. ఇంత జర్నీ లో చాలా నేర్చుకున్నాను .. ఎదో పది సినిమా లకి పని చేస్తే చాలు అనుకుని ,జర్నీ స్టార్ట్ చేశా ... ప్రతీ ఇయర్ 10 సినిమాలకి పని చేస్తున్నా.. ఇదంతా శివయ్య దయ , అమ్మవారి దయ ... నన్ను నేను తాయారు చేసుకోలేదు ..ఒక శక్తి నన్ను మలిచింది ... 1..మొదట సినిమా అంటే ఏమిటో తెలియదు .. 2..తర్వాత సినిమా కి పనిచేస్తూ స్టోరీ , సీన్స్ రాయడం నేర్చుకున్నాను ..  3..తర్వాత డైలాగ్స్ రాయడం నేర్చుకున్నాను ..రాస్తున్నాను .. 4..స్క్రిప్ట్ లకు - స్క్రిప్ట్ డాక్టర్ గా ఉంటున్నాను ..ఎనాలిసిస్ చేసి ఇస్తున్నాను .. 5..స్క్రిప్ట్ లకు డిస్కషన్ చేసి , నెక్స్ట్ లెవెల్ కి తీసుకు వెళ్తున్నాను .. ----------------------------------------------------------------------- రాయడం ఇష్టపడ్డాను ..స్క్రిప్ట్ లు రాసాను ..ఇప్పటికి 50  వరకు స్క్రిప్ట్ లు చేసి

Some messages

Image
 

So many Great movies

Image
చిన్నప్పుడు నాన్న రాజమండ్రి ఖరీదు కి వెళ్లి , వచ్చి .. "జగదేక వీరుడు - అతిలోక సుందరి "  సినిమా చూసి పిల్లలు అయిన అందరికీ , ఆ సినిమా కథ చెప్పారు ..ఇప్పటికీ ఆ వెన్నెల రాత్రి  నాకు గుర్తు ..బయట మంచాలు వేసి పండుకునే వాళ్ళం ... ఆ తర్వాత " రోజా " సినిమా టెన్త్ క్లాస్ లో ఉండగా వేణు అంకుల్ ఇంట్లో చూసాము .. అది చూసాక  అంతా ఒక మంచు భావన లో వున్నాను .. గ్రేట్ సినిమా అంటే అర్ధం అయ్యేది కాదు ..చాలా ఏళ్ల తర్వాత మణిరత్నం గొప్పతనం అర్ధం అయ్యింది ... ఇంటర్మీడియట్ లో ఒకసారి పాల్వంచ దగ్గర ఉన్న అమ్మవారి గుడి కి మొక్కు కోసం అందరం వెళ్ళాం ..బుజ్జి బాబయ్య , నేను, ముత్యాలు అంకుల్ , సత్తిబాబు అంకుల్, నాగ అంకుల్ అందరం - కొత్తగూడెం లో " భారతీయుడు " సినిమా కి వెళ్ళాం ..ఈ సినిమా చూసాక నాకు సినిమా అంటే ఇంత పెద్దగా ,గొప్పగా తీయవచ్చా ? ఆలోచింప చేసేలా తీయవచ్చా ? అని ఆలోచన మొదలయింది .. ఇంటర్ ఖమ్మం లో చేసే నేను - వరసగా ఐదు సార్లు చూసాను ..ఇక్కడే సినిమా డైరెక్టర్ అవ్వాలి అనే ఆలోచన వచ్చి ఉంటుంది ...

Very special people to me

Image
 ఫిలిం ఇండస్ట్రీ లో చాల రకాల వ్యక్తులను కలుస్తాము ..టైం స్పెండ్ చేస్తాము .. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటాము ..అలా చాలా టాలెంట్ వున్న వ్యక్తులను కలిసాను .. వాళ్ళు ప్రస్తుతానికి సక్సెస్ అయ్యి ఉండక పోవచ్చు ..కానీ వాళ్ళు నాకు ఎప్పటికీ ప్రత్యేక వ్యక్తులే ..లైఫ్ జర్నీ లో ఎప్పటికీ గుర్తుండే వాళ్లే... -------------------------------------------------------------------------- దేవ్ వర్మ గారు  అమెరికా నుండి వచ్చారు దేవ్ వర్మ గారు ..చాలా విజన్ వున్న వ్యక్తి .. భీమవరం సొంత వూరు  .. ప్రభాస్ గారి స్టామినా చూసి -ఒకప్పుడే ఇంటర్నేషనల్ లెవెల్ లో కథ ఆలోచించారు .. ఆ స్క్రిప్ట్ కి నేను పని చేశాను .. ఆ స్క్రిప్ట్ " ఒక్క అడుగు "... ఫిలిం మేకింగ్ గురించి , టెక్నాలజీ గురించి బాగా ఆలోచించే వ్యక్తి .. నేను చాలా విషయాలు నేర్చుకున్నాను ..నన్ను బాగా ఆదరించారు ... -------------------------------------------------------------------------- ప్రవీణ్ వర్మ గారు   నాకు -ధూమ్ ధామ్ సినిమా అప్పుడు పరిచయం అయ్యారు .. కామన్ ఫ్రెండ్ రమణ గారు మా ఇద్దరి మధ్య వున్నారు .. ప్రవీణ్ గారు - డైలాగ్స్ బాగా రాస్తారు ..చాలా సినిమా

1st Phase Film Industry Trails ( 2002 - 2004)

Image
    సినిమా ఇండస్ట్రీ లో  అడుగు  పెట్టడం చాలా కష్టం ... సినిమా ఇండస్ట్రీ లో  సక్సెస్  అవ్వడం చాలా కష్టం .. సినిమా ఇండస్ట్రీ లో  కొనసాగడం  చాలా కష్టం ... ----------------------------------------------------------------------   జ్ఞాపకం 1:  తెల్సిన వాళ్ళ ద్వారా  ఫస్ట్ టైం  B.Tech   అవ్వగానే రామానాయుడు స్టూడియోస్ లోకి వెళ్ళాను .. అసిస్టంట్ డైరెక్టర్ గా చేరాలని వెళ్ళాను .. అక్కడ " అమ్మ నాన్న తమిళ అమ్మాయి "షూటింగ్ జరుగుతోంది .  ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మన్ లిద్దరూ ప్రాక్టీసు చేస్తున్నారు .. డైరెక్టర్ పూరి   జగన్నాధ్ కోసం ఎదురు చూసా ...రాలేదు .. అనుకోకుండా ఒకరోజు చూసా ...చాలా హ్యాపీ .. చాలా రోజులు బాక్సింగ్ సెట్  కి వెళ్ళా ...చూస్తున్నా ..ఏమీ అర్ధం కావడం లేదు .. "ఒక్కటే అర్ధమైంది సినిమా తీయడం అంత ఈజీ కాదు "  అని .. ----------------------------------------------------------------- జ్ఞాపకం 2  :  డైరెక్టర్ కృష్ణ వంశి అంటే క్రేజ్ .. తన దగ్గర అసిస్టంట్ గా చేరాలని 3 రోజులు ఇండస్ట్రీ రోడ్స్ అన్నీ అన్నం తినకుండా తిరిగి , ఒక రోజు ఆఫీస్ పట్టుకున్నాను ... ఆ టైం లో ఖడ్గం తీస్తున్నారు .